గుండెల్లో భావాలన్నీ
లోతుల్లో ఉండిపోయాయ్
నువు లేవని దూరంగా
ఇక రావని భారంగా
కన్నుల్లో నీ రూపం
కన్నీళ్ళుగ కరిగిపోయె
రెప్పల మాటున కలకలం
ఎదురు చూసి ఇంతకాలం
మదిలో తుది ఆశ కూడా
మోడై వాడి పోయె
ఈ జన్మకి ఇక నిన్ను
చూడలేనని నిరాశ తో
అయినా ఒక "చిన్ని ఆశ"
ఎక్కడనో దాగి ఉంది
నీ తోడై ఉన్నానంది
తుదిశ్వాసలొ ఉంటానంది
Monday, May 9, 2011
True love
Posted by Unknown at 8:25 AM
Labels: Telugu Love SMS
Subscribe to:
Post Comments (Atom)
0 Comments:
Post a Comment